PDPL: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మండల స్థాయి విలేకరులకు ఎస్ఎస్సి, సీనియారిటీతో, చిన్న పత్రికలకు జీవో ప్రకారం కార్డులు జారీ చేయాలని సూచించారు.