సిద్దిపేట్: గజ్వేల్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలు నిరుపయోగంగా మారడంపై TPCC రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి మండిపడ్డారు. కౌన్సిలర్లతో కలిసి వాహనాలను పరిశీలించిన ఆయన చిన్నపాటి మరమ్మతులు చేయించకుండా పక్కన పడేయడంపై అధికారులను నిలదీశారు. అనవసర ఖర్చులు చేస్తూ, ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య సేవలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వెంటనే వాహనాలను బాగు చేయించాలన్నారు.