NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో మేడే సందర్భంగా వాల్ పోస్టర్లను ప్రగతిశీల భవన నిర్మాణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కోటి చెన్నప్ప ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ చట్టాలను తీసుకువచ్చి కార్మికచట్టాలను కాలరాస్తున్నాయని, శ్రమదోపిడికి వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.