GDWL: జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహ ఊరేగింపును ఆయన ప్రారంభించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.