WNP: రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి ఈ నెల 30తో గడువు ముగియనుందని డీలర్లు తెలిపారు. జిల్లాలోని 325 దుకాణాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల కోటా అందుబాటులో ఉందన్నారు. పంపిణీకి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా వెంటనే బియ్యం తీసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.