WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఇంద్రాణి కాళీ కాలభైరవ శక్తిపీఠం ఉపాసకులు రామకృష్ణ అఘోరి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ గర్భగుడిలో స్వామివారి సాక్షిగా ఆయన శంఖనాదం పూరించడం విశేషంగా మారింది. ధారాపాత్రల నుంచి శివలింగాలపై జలధారలు కురుస్తున్న వేళ, ఆయన చేసిన శంఖధ్వనితో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది.