SRPT: నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన సహస్ ప్రిన్స్, సుము సహస్ ప్రిన్స్లు కీబోర్డును గంటపాటు నిరవధికంగా వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందారు. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. ఈ చిన్నారులు సిరిపురం గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు.