మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. న్యాయం కోసం దళిత క్రైస్తవులందరూ కలిసికట్టుగా పోరాడాలని జిల్లా కన్వీనర్ కాశపోగు ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామెల్ ప్రభాకర్, పల్లె ఏసుదాసు, జగన్ తదితర ప్రజాసంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు.