MBNR: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా జిల్లాలో ’99 రోజుల ప్రగతి ప్రణాళిక’పై సమీక్షించారు. మిషన్ భగీరథ, మురుగునీటి శుద్ధి, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఈ ప్రణాళిక కీలకం కానుంది.