NZB: జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సితారే క్షవీన్ రాజ్, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సాహిద్ అలీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో మీసేవ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. మీసేవ కమిషన్ల పెంపుపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.