TG: BRS ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలం పెరిగిందని, నల్గొండలో చిన్న పొరపాట్లతోనే సీట్లు కోల్పోయామని చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తాము తెచ్చిన స్కైరూట్ కంపెనీకి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.