మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో 108 ఉద్యోగులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. నవజాత శిశువులకు సీపీఆర్ చేయడం, శ్వాస ఇబ్బందులు, అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణ మెలకువలపై ఈఎంఆర్ఎ గ్రీన్ హెల్త్ కోఆర్డినేటర్లు దృశ్యరూపంలో అవగాహన కల్పించారు. మందుల వినియోగంపై సూచనలిచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఎం రవి, తదితరులు పాల్గొన్నారు.