HYD శివారులో ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 కోట్ల వ్యయంతో FCDA కార్యాలయం నిర్మాణం కొనసాగుతోంది. మరో నెల రోజుల్లో ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలలో జరగనున్న అభివృద్ధికి సంబంధించి వివిధ డిజైన్లను అధికారులు విడుదల చేశారు.