GDWL: ఎర్రవల్లి మండలం కోదండాపూర్ శివారులోని NH-44పై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వోల్వో బస్సు ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.