MDK: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో రూ. 15 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందిరమ్మ ఇళ్లు, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.