పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్‌ను తెరపై చూస్తుంటే సాక్షాత్తు మైఖేల్ జాక్సనే మళ్లీ తిరిగి వచ్చాడా అన్నట్లుగా ఉందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.