TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా డ్రగ్స్ ముఠా పట్టుబడింది. సుమారు రూ.11 కోట్ల విలువైన క్రిస్టల్ మెత్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్‌ను విదేశాలకు సరఫరా చేసేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.