NLG: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాములలోని ఐకేసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.