JN: నర్మెట్ట మండల కేంద్రంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ ఇన్పుట్ డీలర్ల దుకాణాలను అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరామానుజచారి, ఎంఏవో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.