AP: ఎల్‌నినో ప్రభావంతో July, Augలో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని CRIDA సైంటిస్ట్ KV రావు వెల్లడించారు. జూన్‌లో పడే వర్షాలను చూసి రైతులు తొందరపడి వరి సాగు చేయొద్దన్నారు. NG రంగా వర్సిటీ వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ‘నీటి లభ్యతపై అంచనాకు వచ్చాకే పంటలను ఎంచుకోవాలి. వాతావరణ మార్పులను బట్టి ప్రణాళికతో సాగు చేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చు’ అని తెలిపారు.