MDK: జిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కలెక్టర్ ప్రతిమా సింగ్ పటిష్ఠ చర్యలు చేపట్టారు. డెక్కన్ టెరైన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా, సమగ్ర ప్రణాళికలతో పురాతన పర్యాటక ప్రదేశాలకు పూర్వవైభవం తీసుకువస్తామని కలెక్టర్ వెల్లడించారు.