HNK: మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై ఇవాళ ఆన్లైన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. భారతీయ న్యాయ సంహిత-2023లోని ముఖ్యాంశాలు, సెక్షన్లలో చోటుచేసుకున్న మార్పులపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపీ రమణ బాబు.. కొత్త చట్టాల అమలులో పాటించాల్సిన మెళకువలను వివరించారు.