2026 ఆసియా క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు ఓటమి ఎదురైంది. మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో మీనాక్షి గోయత్ చేతిలో 4-6తో ఓడింది. దీంతో ఏషియన్ గేమ్స్ రేసు నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతిచ్చినా.. తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది.