AP: జూన్ నెలకు సంబంధించి NTR భరోసా పెన్షన్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛన్ల కోసం రూ.2,728 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జూన్ నెలలో 62,34,445 మందికి పెన్షన్లు ఇవ్వనున్నారు. కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.