TG: BRS పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గతంలో వరి వేస్తే ఉరి అని BRS రైతులను భయపెడితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇష్టమైన పంట పండించుకునే స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. పదవుల పంపకాల విషయంలో గొడవలతోనే BRS ప్రస్తుతం విచ్ఛిన్నం అవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.