KNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మరింత వేగిరంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. మానకొండూర్ మండలం కొండపలకల గ్రామంలో బొంగోని కవిత-కృష్ణ, బొల్లం ఉమ-శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు బుధవారం ఆయన హాజరయ్యారు.