AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దారుణం జరిగింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న గొల్లపూడికి చెందిన బ్రహ్మం అనే దివ్యాంగుడిపై సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. భిక్షాటన చేస్తున్నందుకు బ్రహ్మంపై దాడి చేసినట్లు తెలిసింది. కర్రలతో వాతలు వచ్చేలా వీపుపై కొట్టారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేయడంతో తోటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.