TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఎరువుల దుకాణాలు మూసి ఉండనున్నాయి. ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ ఎరువుల డీలర్లు బంద్ పాటించనున్నట్లు రాష్ట్ర ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎరువుల సరఫరాపై ఎఫ్వోఎల్ విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.