MDK: రాయలపూర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు రైతువేదికలో ‘రైతు నేస్తం’ కార్యక్రమం జరుగుతుందని ఏఈఓ సాయికృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలతో నానో యూరియా వినియోగం, వరి సన్నరకాల సాగుపై ముఖాముఖి చర్చలు నిర్వహించబడతాయన్నారు. రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని వెల్లడించారు.