KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కలెక్టర్ అనుదీప్ తెలంగాణ ప్రభుత్వ ITE &C డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా నియామకం అయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా దివాకర నియామకమయ్యారు. వారు ములుగు జిల్లా నుంచి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.