VKB: పరిగి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం పరిగిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవగా, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యా రు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.