SDPT: జగదేవపూర్ జై భీమ్ కాలనీలో కొత్తగా నిర్మించిన ఎర్ర పోచమ్మ తల్లిని గజ్వెల్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మచ్చ గణేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.