TG: చంద్రబాబుతో జై తెలంగాణ అని అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. ‘తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇది చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి? తెలంగాణ గురించి ఎంపీ తేజస్వి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లు’ అని అన్నారు.