RR: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులుగా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం మిర్జాగూడ గ్రామానికి చెందిన తొండ రవి నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్, SC మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ ఆధ్వర్యంలో రవికి నియామక పత్రం అందజేశారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తొండ రవి అన్నారు.