NGKL: కల్వకుర్తి పట్టణంలో గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం గోమాత గౌరవ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవును జాతీయ ప్రాణి గా గుర్తించాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో గోవును తల్లీలా, పూజిస్తారని, అందుకే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.