JBL: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగా ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ నమోదుకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలు తమ ఇంటి నుంచే https://se.census.gov.in ద్వారా కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సిబ్బంది కోసం వేచి చూడకుండా టెక్నాలజీ సహాయంతో వేగంగా వివరాలు సమర్పించాలని పేరొన్నారు.