ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్క్, రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న తదుపరి పోరులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్వయంగా ధృవీకరించాడు. స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.