SDP: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్లో సీఎం నివాసం వరకు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దని,తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.