MBNR: జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఉపాధి హామీ, పారిశుద్ధ్యం, నర్సరీ, ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంచాలని, 100 మందికి ఉపాధి కల్పించాలని ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలు పెంచాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.