MBNR: మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత దవాఖాన ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుందని, చలిజ్వరం, చెమటలు పట్టడం దీని ప్రధాన లక్షణాలని వివరించారు.