కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్, ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో దర్శకుడు శంకర్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు కమల్ హాసన్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.