SRPT: అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం మలేరియా దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. 2030 నాటికి మలేరియా రహిత సమాజమే లక్ష్యమన్నారు. పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని, ప్రతి వారం ‘డ్రై డే’ పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.