GDWL: ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గద్వాల, వనపర్తి జిల్లాల్లో 43–45 డిగ్రీలు, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో 42–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.