గుజరాత్‌తో మ్యాచ్‌లో RCB నిలకడగా రాణిస్తోంది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 118/1 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 49, పడిక్కల్ 52 పరుగుల వద్ద ఉండగా.. అంతకుముందు ఓపెనర్ బెథెల్(14) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు.