TG: ప్రజాస్వామ్య బద్ధంగా HILT పాలసీని అమలు చేస్తామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మే తొలి వారం నుంచి భూముల మార్కెట్ విలువ సవరింపు ఉంటుందని, చైనా తరహాలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఉంటాయన్నారు.