NDL: అవుకు మండలం మంగపేట తండాలో ఈ నెల 28న చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవర మహోత్సవాలను గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి వైభవంగా నిర్వహిస్తున్నారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మను మంగంపేట గ్రామ ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం దేవర మహోత్సవాలకు రావాలని వారు ఆమెను ఆహ్వానించారు.