MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర, కంప్యూటర్ సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “AI in Business” 30 రోజుల సర్టిఫికేట్ కోర్స్ విజయవంతంగా ముగిసింది. ఈ కోర్స్ ద్వారా విద్యార్థులు AI వినియోగం, డేటా విశ్లేషణ, డిజిటల్ మార్కెటింగ్, స్మార్ట్ ఆటోమేషన్ అంశాలపై అవగాహన పొందారు. ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ సర్టిఫికెట్లు అందించారు.