తెలంగాణ ఆర్టీసీ సమ్మె విజయవంతం కావడంపై ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నేతలు పలిశెట్టి దామోదరరావు, జి.వి. నరసయ్య ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా యూనియన్ ఎన్నికల నిర్వహణకు అంగీకరించడం, వేతన సవరణపై కమిటీ వేయడం శుభపరిణామన్నారు.