TG: కవిత పార్టీ పెట్టినందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందన్నారు. దోపిడీపై కవిత వివరణ ఇవ్వడం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.