కరీంనగర్ జిల్లాలోని ఖాన్పురాలో సెలూన్ కార్మికుడు పగడాల రాముపై దురుసుగా ప్రవర్తించిన త్రీటౌన్ ఎస్సై చందర్పై వేటు పడింది. ‘అన్నా కూర్చో’ అన్నందుకు కార్మికుడిని దూషించి, దాడి చేసిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.